గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (05:39 IST)

శుభోదయం : మీ రాశి ఫలితాలు 18-08-17

మేషం : ఈ రోజు దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుబారా ఖర్చులు తగ్గించాలన్న మీ యత్నం ఫలించదు. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు, అపరిచిత వ్యక్తులను దూరంగా ఉంచడం

మేషం : ఈ రోజు దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుబారా ఖర్చులు తగ్గించాలన్న మీ యత్నం ఫలించదు. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు, అపరిచిత వ్యక్తులను దూరంగా ఉంచడం క్షేమదాయకం. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలించదు. స్త్రీల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు.

వృషభం : ఈ రోజు ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహ వాతావరణం నెలకొంటుంది. కుటుంబీకుల ప్రేమాభిమానాలు పొందగలుగుతారు. వ్యాపారాల విస్తరణకు కొంత జాప్యం తప్పదు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి విశ్రాంతి లభిస్తుంది.

మిథునం : ఈ రోజు ధనం మితంగా వ్యయం చేయండి. ముఖ్యమైన పత్రాలు కనిపించక ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మందులు, ఫ్యాన్సీ, ఆల్కహాల్, కొబ్బరి, పానీయ వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులు స్థాన చలనానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం : ఈ రోజు విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడతుంది. ప్రేమికుల మధ్య ఎడబాట్లు తప్పవు. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకుని తెలివి తేటలతో ముందుకు సాగి జయం పొందండి.

సింహం : ఈ రోజు పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీరు చేసే పనులకు బంధువుల నుంచి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి.

కన్య : ఈ రోజు విలాసాలకు బాగా ధనం వ్యయం చేస్తారు. విదేశీ యత్నాలు ఫలించగలవు. సోదరీ సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఏకాగ్రత చాలా అవసరం. మీ కృషికి గుర్తింపు ప్రతిఫలం లభిస్తాయి. ఉత్సాహంతో కొత్త యత్నాలు సాగిస్తారు. పనులు, వ్యవహారాలు చక్కగా సాగుతాయి.

తుల : ఈ రోజు ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రవాణా, ఎగుమతి, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం, పనులు నెమ్మదించినా అనుకున్న విధంగా పూర్తికాగలవు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త అవసరం.

వృశ్చికం : ఈ రోజు గృహంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. విలువైన వస్తువులు, వాహనం కొనుగోలు చేస్తారు. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండాలి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

ధనస్సు : ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, ఇతర ఒప్పందాలు మీకు అనుకూలంగా పరిష్కారం కాగలవు. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించడం మంచిది. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సమయానుకూలంగా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది.

మకరం : ఈ రోజు వృత్తి ఉపాధి పథకాల్లో నిలుదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్త్రీలకు రచనలు, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం శ్రేయస్కరం.

కుంభం : ఈ రోజు కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన విషయాలలో మెలకువ వహించండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఉత్సాహం, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి.

మీనం : ఈ రోజు వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలను గడిస్తారు. నూతన పెట్టుబడులు, పొదువు పథకాలు లాభిస్తాయి. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం కానవస్తుంది. స్త్రీలకు కళ్లు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది.