శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2017 (09:10 IST)

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 07-10-17

మేషం: విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. భాగస్వామిక వ్యాపారాల్లో కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. దుబారా ఖర్

మేషం: విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. భాగస్వామిక వ్యాపారాల్లో కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. దుబారా ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా ఉంటాయి. 
 
వృషభం : నూతన వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణలు అనుకూలిస్తాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వాహనం కొనుగోలు చేయుప్రయత్నాలలో జయం చేకూరును. డాక్టర్లు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాదాస్పద అంశాల్లో తలదూర్చకండి. 
 
మిథునం : ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచనలుంటాయి. పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు తిరిగి పొందుతారు. బంధుమిత్రులతో పట్టింపులు, విభేదాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకుంటారు. 
 
కర్కాటకం : ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి అవసరం. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ముందు చూపుతో వ్యవహరించండి. ఎదుటివారు చెప్పేది జాగ్రత్త విని మీ ఆలోచనలు తగిన విధంగా మలుచుకోండి. 
 
సింహం : మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు వరిస్తాయి. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కన్య : ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మార్పులు సంభవిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పాత వ్యవహారాలు మీకు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. 
 
తుల : స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు. రాజకీయాలలో వారికి మెళకువ అవసరం. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాల సందర్శనాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. పెద్దలతో పరస్పర ఏకీభావం కుదురుతుంది. చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ఊహించని ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : స్త్రీలు, దైవ, శుభ కార్యాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ చిన్నారుల కోసం ధనం అధికగా వెచ్చిస్తారు. రచయితలకు, కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
మకరం : దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచింది. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. దైవ, సేవ, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. మీ సంతానం ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెలకు అవసరం. మంచికి పోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటారు. 
 
కుంభం : దైవ, సేవ పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. విద్యార్థినులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. 
 
మీనం : భాగస్వామికులతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం క్షేమదాయకం. దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ముఖ్యుల కోసం షాపింగ్‌లు చేస్తారు. కుటుంబీకులతో ఏకీభవించలేరు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.