Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 12-10-17

గురువారం, 12 అక్టోబరు 2017 (05:47 IST)

Widgets Magazine
time

మేషం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. బ్యాంకుల్లో హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాలలో మెలకువ అవసరం మనుష్యుల మనస్థత్వం తెలిసి మసలుకొనుట మంచిది.
 
వృషభం : స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. రేపటి గురించి అధికంగా ఆలోచిస్తారు. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగాలలో వారికి అనుకూలమైన కాలం. పట్టువిడుపు ధోరణితో సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామికవేత్తలకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
మిథునం : సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటుతనం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు.
 
కర్కాటకం : రుణం తీర్చడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తుల వారికి గుర్తింపు, ఆదాయాభివృద్ధి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. వ్యాపారాల్లో పోటీ, పనివారితో చికాకులు ఎదుర్కొంటారు. సేవ, సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు, పనులు సమకూర్చుకుంటారు.
 
సింహం : దైవకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. షాపు గుమస్తాలు, పనివారలకు ఆదాయాభివృద్ధి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తప్పవు. ఏ పనిముందుకు సాగక విసుగు చెందుతారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీతో సఖ్యతగా నటించి తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు.
 
కన్య : చేతి వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా లభించిన ప్రతిఫలం సంతృప్తికరం. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. సొంత వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు
 
తుల : చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. కొన్ని అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ముఖ్యంగా మీ తాహతుకు మించి ఖర్చు చేయకండి. గత తప్పిదాలు పునరావృతంకాకుండా తగు జాగ్రత్త వహించండి. దాన ధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
వృశ్చికం : వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ చిన్నారులకు ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
ధనస్సు : ప్రైవేటు, పత్రికా రంగంలోకి వారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యం ఉంటుంది. విదేశాలు వెళ్లడానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
 
మకరం : ఉపాధ్యాయుల పనితీరుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల్లో నిలదదొక్కుకుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కుంభం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తనా నెమ్మదిగా సమసిపోగలవు. వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యార్థినులు, విద్యార్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
మీనం : ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. స్త్రీలకు ధనార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఊహించని ప్రయాణాలు సంభవిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 11-10-17

మేషం: రాజకీయ నాయకులు తరచు సభాసమావేశాలల్లో పాల్గొంటారు. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు ...

news

ఉదయం పక్క పైనుంచి నిద్ర లేచి ఇలా నడిస్తే ఎన్నో లాభాలు...

భారతీయ వాస్తు శాస్త్రాలకు ఓ ప్రత్యేక ఉంది. ఈ శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలు, సూచనలు ...

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 10-10-17

మేషం : కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభంకాగలవు. అకాల భోజనం, ...

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 09-10-17

మేషం: వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయిగా ఉంటుంది. మీ సంతానం ...

Widgets Magazine