శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (16:06 IST)

శివునిని ఈ శ్లోకంతో పూజిస్తే.. ఇక సుఖసంతోషాలే..!

పుణ్యపాప ఫలితాలే జీవిత సుఖదుఖాలని పండితులు అంటున్నారు. వారు వారు చేసిన పాప ఫలితాలు అనుభవించక తప్పదు. అయితే పాప ఫలితాల నుంచి విముక్తి పొందాలంటే శివనామస్మరణ చేయడం ఉత్తమం. శివ పరమాత్మను మనసారా ధ్యానించి.

పుణ్యపాప ఫలితాలే జీవిత సుఖదుఖాలని పండితులు అంటున్నారు. వారు వారు చేసిన పాప ఫలితాలు అనుభవించక తప్పదు. అయితే పాప ఫలితాల నుంచి విముక్తి పొందాలంటే శివనామస్మరణ చేయడం ఉత్తమం. శివ పరమాత్మను మనసారా ధ్యానించి..ఆయనను ప్రతిరోజూ పూజించే వారికి పుణ్యఫలాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 
 
అందుకే ప్రతిరోజూ ఉదయం ఈ శ్లోకాన్ని పఠించాలి. 
 
ఓం శివాయ గురవే నమః |
 
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||
 
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయాత్ ||
 
ఓం త్రయంబకాయ విద్మహే మృత్యుంజయాయ ధీమహి |
తన్నో పరమశివ ప్రచోదయాత్ ||
 
అలాగే ఈ మంత్రాన్ని శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు లేదా శివరాత్రి పూట లేదా ప్రదోష కాలంలో శివాలయంలో స్తుతిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. తద్వారా పాపాలు తొలగిపోతాయి. పుణ్యఫలాలు చేకూరుతాయి.