శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 4 ఆగస్టు 2017 (13:23 IST)

తిరుమల శ్రీవారి ఆలయంలో మరో అపచారం.. ఏంటది?

టిటిడి ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శ్రీవారి ఆలయంలో ఏది చేయాలన్నా ఆగమాలకు లోబడే చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్థంగా వ్యవహరిస్తూ భక్తులు మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్

టిటిడి ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శ్రీవారి ఆలయంలో ఏది చేయాలన్నా ఆగమాలకు లోబడే చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్థంగా వ్యవహరిస్తూ భక్తులు మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారు టిటిడి ఉన్నతాధికారులు. ఎన్నో యేళ్ళుగా వస్తున్న ఆగమాలను ఒక్కసారిగా మార్చేస్తున్నారు. ఆగమ పండితులు, సలహాదారుల సలహాలను తీసుకోకుండానే ఇష్టానుసారం నిర్ణయాలను తీసేసుకుంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు. అలాంటి నిర్ణయమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాశంగా మారి మరో అపచారానికి తెర లేచింది. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికైనా, దర్శించుకున్న తరువాతైనా బయటకు రావాలంటే వెండివాకిలి నుంచి ఒకటే మార్గం. ఎన్నో సంవత్సరాల నుంచి అది ఒకటే మార్గం ఉంది. ఇది ఇప్పటిది కాదు ఆగమ శాస్త్రాల ప్రకారంగానే నడుస్తోంది. అలాంటిది టిటిడి ఉన్నతాధికారులు భక్తులు బయటకు వచ్చే ప్రాంతంలో ఇనుప మెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని హడావిడిగా ఏర్పాటు చేసేశారు. నిన్న రాత్రికి రాత్రే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. వెండివాకిలి కుడివైపు ఉన్న రెండవ ప్రాకారానికి ఇనుప మెట్లను నిర్మించేశారు. ఆగమాల ప్రకారం ఇలా నిర్మించకూడదు. అందులోను 15 నుంచి 20 అడుగుల ఎత్తులో ఈ ప్రాకారం ఉంది. 
 
టిటిడి ఉన్నతాధికారులు ఇష్టానుసారం నిర్ణయం తీసేసుకుని ఆగమేఘాలపై హడావిడి చేసి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మఠాధిపతులు, పీఠాధిపతులు టిటిడి ఉన్నతాధికారుల నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆగమాలను అధిగమించడానికి టిటిడి ఉన్నతాధికారులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. టిటిడి ఉన్నతాధికారులు ఈ విషయంలో వెనక్కి తగ్గుతారా.. లేకుంటే ఆగమాలకు విరుద్ధంగా కొనసాగిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.