శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: సోమవారం, 21 మార్చి 2016 (11:22 IST)

తిరుమలలో రద్దీ సాధారణం... శ్రీవారిని దర్శించుకున్న అమర్ సింగ్

తిరుమలలో రద్దీ తగ్గుముఖం పట్టింది. నిన్న ఆదివారం కావడంతో ఆధ్మాత్మిక క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ఉదయానికి భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది. సోమవారం ఉదయం 5గంటల నుంచి సర్వదర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు 3గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 2కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. కాలినడక భక్తులకు 2గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 80,715మంది భక్తులు దర్సించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 38లక్షల రూపాయలు వచ్చింది. 
 
తిరుమల శ్రీవారి సేవలో అమరసింగ్‌
 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని సమాజ్‌ పార్టీ నేత, మాజీ ఎంపి అమర్‌ సింగ్‌ దర్శిచుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి సేవలో అమర్‌సింగ్‌ పాల్గొన్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు అమర్‌సింగ్‌ కుటుంబానికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామి వారి తీర్థప్రసాదాలను టిటిడి అధికారులు అందజేశారు. మీడియాతో మాట్లాడకుండానే అమర్‌ సింగ్‌ వెళ్ళిపోయారు.