శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (12:31 IST)

జనవరి 31న శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే?

ఈనెల 31వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. 31వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు పగటి పూటంతా మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సాయంత్రం 5

ఈనెల 31వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. 31వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు పగటి పూటంతా మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సాయంత్రం 5.18 నుంచి రాత్రి 8.41 వరకు గ్రహణం ఏర్పడనుంది. 
 
అయితే, గ్రహణం ప్రారంభం కావడానికి 8 గంటల ముందుగానే ఆలయానికి తాళాలు వేయనున్నారు. ఈ కారణంగా రోజంతా స్వామివారి దర్శనం ఉండదని అధికారులు స్పష్టంచేశారు. గ్రహణం విడిచిన తర్వాత, ఆగమ శాస్త్ర ప్రకారం, ఆలయాన్ని శుద్ధి చేసి, పుణ్యాహవచనం తర్వాతే భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. 
 
అంటే, 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి భక్తులను తితిదే అనుమతించనుంది. అయితే, బుధవారం తెల్లవారుజామున జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని స్పష్టంచేశారు.