గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (10:05 IST)

గుజరాత్ రిజల్ట్స్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 650కుపైగా పాయింట్ల న‌ష్టంలో ఉంది

గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 650కుపైగా పాయింట్ల న‌ష్టంలో ఉంది. నిఫ్టీ 200 పాయింట్ల న‌ష్టంలో ట్రేడ్ అవుతున్న‌ది. 
 
గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం ఖాయ‌మ‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా.. ట్రెండ్స్ మాత్రం హోరాహోరీగా ఉన్నాయి. బీజేపీకి కాంగ్రెస్ గ‌ట్టి పోటీని ఇస్తోంది. అనేక ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. ఇది కూడా స్టాక్ మార్కెట్ల‌ను ప్ర‌భావితం చేస్తున్న‌ది.
 
ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి బీజేపీ గట్టిపోటీ ఇస్తోంది. ఈ రాష్ట్రంలో ఓటర్లు అధికార మార్పిడి కోరుకున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ.. పోటీ మాత్రం ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా కొనసాగుతోంది.