బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 31 మే 2016 (17:09 IST)

స్టాక్ మార్కెట్ : వరుస లాభాలకు స్వల్ప బ్రేక్

బాంబే స్టాక్ మార్కెట్‌లో ఐదు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు మంగళవారం స్పల్పంగా బ్రేక్ పడింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 58 పాయింట్లు నష్టపోయి 26,668 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ కూడా 18 పాయింట్లు నష్టపోయి 8,160 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.19 వద్ద కొనసాగుతోంది. 
 
ఈ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్‌, డీవీఆర్‌ సంస్థల షేర్లు అత్యధికంగా 11.21 శాతం లాభపడగా, టాటా మోటార్స్‌, అరబిందో ఫార్మా, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ సంస్థల షేర్లు లాభాలను అర్జించాయి. అదేవిధంగా సన్‌ ఫార్మా సంస్థ షేర్లు అత్యధికంగా 6.17 శాతం నష్టపోయి రూ.762 వద్ద ముగిశాయి. వీటితోపాటు భారతీ ఇన్ఫ్రాటెల్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, గెయిల్‌ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.