గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2016 (19:26 IST)

భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీ.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర

బాంబే స్టాక్ మార్కెట్‌లో మంగళవారం సెన్సెక్స్ సూచీ భారీ నష్టాలతో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 379 పాయింట్లు నష్టపోయి 23,410 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 7,109 పాయింట్ల వద్ద స్థిరపడింది. 
 
అదేవిధంగా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.50 వద్ద కొనసాగింది. నిఫ్టీలో ఏషియన్‌ పెయింట్స్‌ సంస్థ షేర్లు 0.40 శాతం లాభపడి రూ.874.30 వద్ద ముగిశాయి. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సంస్థ షేర్లు 4.81 శాతం నష్టపోయి రూ.132.55 వద్ద ముగిశాయి. వీటితోపాటు కెయిర్న్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ సంస్థల షేర్లు కూడా నష్టాలు మూటగట్టుకున్నాయి.
 
మరోవైవు.. బంగారం ధర కూడా వరుసగా మూడోరోజు కూడా స్వల్పంగా తగ్గింది. రూ.60 తగ్గడంతో పదిగ్రాముల బంగారం ధర రూ.28,910కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర తగ్గడం, ఇక్కడ నగల వ్యాపారులు, సాధారణ వినియోగదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో దీని ధర తగ్గిందని బులియన్‌ వర్గాలు తెలిపాయి.