బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2017 (12:19 IST)

సంప్రదాయ దుస్తులతో రెజ్లింగ్ రింగ్‌లోకి.. కవితపై ప్రశంసలు (Video)

భారతీయ మల్లయుద్ధ యోధురాలు కవితా దేవి. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈమె... డబ్ల్యూ‌డబ్ల్యూఈ పోటీలలకు ఎంపికై తొలి భారతీయ మహిళ. తాజాగా జరుగుతున్న "మే యంగ్ క్లాసిక్" టోర్న‌మెంట్‌లో ఆమె న్యూజిలాండ్‌కు చెంది

భారతీయ మల్లయుద్ధ యోధురాలు కవితా దేవి. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈమె... డబ్ల్యూ‌డబ్ల్యూఈ పోటీలలకు ఎంపికై తొలి భారతీయ మహిళ. తాజాగా జరుగుతున్న "మే యంగ్ క్లాసిక్" టోర్న‌మెంట్‌లో ఆమె న్యూజిలాండ్‌కు చెందిన డ‌కోటా కైతో త‌ల‌ప‌డింది. ఈ పోటీలో ఆమె గెల‌వ‌క‌పోయినా రెజ్లింగ్ రింగ్‌లోకి సంప్ర‌దాయ వ‌స్త్రాల‌తో వెళ్లినందుకు ఆమెను భార‌త నెటిజ‌న్లు పొగడ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. 
 
అలాగే పోటీలో భాగంగా ఆమె చేసిన విన్యాసాల‌ను కూడా వారు మెచ్చుకుంటారు. క‌వితా దేవి పోటీకి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. భార‌త యువ‌తుల్లో రెజ్లింగ్ మీద ఆస‌క్తి క‌లిగించ‌డానికే తాను స‌ల్వార్ క‌మీజ్ ధ‌రించి రింగ్‌లోకి దిగిన‌ట్లు క‌వితా దేవి చెప్పారు.