శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (11:42 IST)

జమైకా చిరుత చివరి పరుగు.. సొంత మైదానంలో రిటైర్మెంట్ తీసుకున్న బోల్ట్

లండన్‌లో జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు తర్వాత తన పరుగు ఆపేద్దామని.. పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ నిర్ణయించుకున్నాడు. సొంత మైదానంలో జరిగిన చివరి ప

లండన్‌లో జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు తర్వాత తన పరుగు ఆపేద్దామని.. పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ నిర్ణయించుకున్నాడు. సొంత మైదానంలో జరిగిన చివరి పోరులో ఉసేన్ బోల్ట్ విజయం సాధించాడు. స్వదేశంలో సొంత అభిమానుల ముందు చివరి పోటీల్లో పాల్గొన్న బోల్ట్  వేగాన్ని ఏమాత్రం ఆపలేదు. 
 
జమైకా చిరుత చివరి పరుగును చూసేందుకు భారీ సంఖ్యలో జమైకన్లు మైదానానికి తరలివచ్చారు. ఈ క్రమంలో 10.03 సెకన్లలో వంద మీటర్ల దూరాన్ని అధిగమించి.. ఆ విజయంతో సొంత అభిమానులకు అభివాదం చేశాడు.
 
తన తల్లిదండ్రులు, స్నేహితుడు ఎన్‌జే, జమైకా ఫ్యాన్స్ లేకుండా కెరీర్లో ఇన్ని విజయాలు సాధించే వాడిని కాదన్నాడు. తనకు ఇంతకాలం అండగా నిలిచిన జమైకాకు అభివాదం చేస్తున్నానని బోల్ట్ ఉద్వేగంతో మాట్లాడాడు. ఆపై థ్యాంక్యూ జమైకా అంటూ ట్వీట్ చేశాడు.