గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (14:54 IST)

పిఫా అండర్-17 ప్రపంచకప్.. నీళ్ల బాటిళ్లు అందక.. టాయిలెట్ నీళ్లు తాగారు..

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోకి వాటర్ బాటిళ్లను అనుమతించకపోవడంతో దాహంతో అల్లాడిపోయారు. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న పిఫా అండర్-17 ప్రపంచ కప్‌లో భారత ఫుట్‌బాల్ అభిమానులకు తొలిరోజే నిరాశను మ

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోకి వాటర్ బాటిళ్లను అనుమతించకపోవడంతో దాహంతో అల్లాడిపోయారు. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న పిఫా అండర్-17 ప్రపంచ కప్‌లో భారత ఫుట్‌బాల్ అభిమానులకు తొలిరోజే నిరాశను మిగిల్చింది.
 
వాటర్ బాటిళ్లను అనుమతించకపోవడంతో చేసేది లేక టాయిలెట్‌లోని నీళ్లను తాగి గొంతు తడుపుకున్నారు. దేశంలో తొలిసారి జరుగుతున్న పుట్‌బాల్ ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌ను చూసేందుకు భారత ప్రభుత్వం మొత్తం 27వేల టిక్కెట్లు, టీ షర్టులు, టోపీలను విద్యార్థులను పంపిణీ చేసింది. 
 
ప్రధానమంత్రి మోడీ ఈ మ్యాచ్ చూసేందుకు రావడంతో స్టేడియం ఖాళీగా కనిపించకుండా ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థులను భారీగా స్టేడియానికి రప్పించారు. అయితే నిర్వహణ లోపంతో ఫ్యాన్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
అందుబాటులో ఉంచిన కొన్ని నీళ్ల సీసాలు సరిపోకపోవడంతో వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. దక్కనివారు దాహానికి తాళలేక టాయిలెట్‌లోని నీటితో దాహం తీర్చుకున్నారు. ఇక స్టేడియంలో డస్ట్‌బిన్‌లు సరిపడా ఉంచకపోవడంతో స్టేడియం మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది.