శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (14:50 IST)

శ్రీరామనవమి స్పెషల్: పైనాపిల్ బాసుందీ ట్రై చేయండి..

శ్రీరామనవమి రోజున స్పెషల్‌గా బనానా బాసుందీ ట్రై చేయండి. 
 
కావలసిన పదార్థాలు : 
పైనాపిల్ ముక్కలు : అర కప్పు
పాలు  : మూడు కప్పులు 
పంచదార : పావు కప్పు 
యాలకుల పొడి : ఒక టీస్పూన్
కుంకుమపువ్వు : పావు టీస్పూన్ 
జీడిపప్పులు : పావు కప్పు 
పిస్తా పప్పు : పావు కప్పు
నెయ్యి : కొద్దిగా 
 
తయారీ విధానం :
గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. సగం అయ్యాక చక్కెర, యాలకులపొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి. సన్నని మంట మీద ఉంచి పైనాపిల్ ముక్కలు వేసి ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. ఈలోపు కడాయిలో జీడిపప్పు, బాదం, పిస్తాలను నెయ్యి వేసి వేయించుకోవాలి. వీటిని పైనాపిల్ బాసుందీలో కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. చల్లగా తాగితే వేసవిలో హాయిగా ఉంటాయి.