శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By chitra
Last Updated : బుధవారం, 13 జనవరి 2016 (15:23 IST)

సంక్రాంతి స్పెషల్ బొబ్బట్లు

సంక్రాంతి పండుగకు ఊళ్లల్లో వారం ముందు నుంచే పిండి వంటల హడావిడి మొదలయ్యేది ఒకప్పుడు..... గ్రామాలన్నీనెయ్యి వాసనతో గుబాళించేది. పిండి వంటలు చేయడంలో ఊరు ఊరంతా బిజీగా ఉండేది. ఆకాశంలో కనిపించే గాలిపటాలు, ఆకట్టుకునే రంగువల్లులతో కళకళలాడే లోగిళ్లూ, బంధువుల ముచ్చట్లూ..... ఇలా సంక్రాంతి అంటే అన్ని ప్రత్యేకతలే. ఈ సమయంలో ఎన్ని ఎక్కువ పదార్ధాలు చేసుకుంటే పండగ, సంబరాలు అంతలా రెట్టింపు అవుతాయి. అలాంటి వంటల్లో ఒకటైన బొబ్బట్లు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం!
 
కావలసిన పదార్ధాలు : 
మైదా : అరకిలో 
పచ్చి శెనగపప్పు : పావుకిలో
కొబ్బరి తురుమ : 1 కప్పు
బెల్లం : పావు కిలో
ఎండుద్రాక్షలు, జీడిపప్పు: నెయ్యిలో వేయించినది 
యాలకుల పొడి : కొద్దిగా
నెయ్యి : సరిపడా
 
తయారు చేసే విధానం : 
 
మైదాపిండి జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో సరిపడా నీరుపోసి ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో శెనగపప్పును వేసి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మిగిలిన నీటిని పూర్తిగా వంపేయాలి. ఈ పప్పులో కొబ్బరికోరు, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత  చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని  చిన్నచిన్నఉండలుగా తీసుకోని రెడిచేసి పెట్టుకున్న శెనగపప్పు ముద్దని మధ్యలోపెట్టి మళ్లీ ఉండలుగా చేసి కాస్త మందంగా చపాతిలా చేసి, పెనుము మీద నెయ్యి వేసి కాల్చాలి. అంతే రుచికరమైన వేడివేడి బొబ్బట్లు రెడీ... గార్నిషింగ్ కోసం వేయించిన జీడిపప్పు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది.