శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 జనవరి 2015 (17:00 IST)

సంక్రాంతి వంటలు: నువ్వుల అరిసెలు ఎలా చేయాలి?

సంక్రాంతికి సొంత గ్రామానికి వెళ్లిపోయారా.. పిండివంటలు చేయాలనుకుంటున్నారా.. అయితే నువ్వుల అరిసెలు ట్రై చేయండి. 
 
నువ్వుల అరిసెలకు కావలసిన పదార్థాలు:
బియ్యం - ఒక కేజీ 
బెల్లం - అర కేజీ 
నువ్వులు - 50 గ్రాములు 
నూనె - తగినంత 
 
తయారీ విధానం : 
ఒకరోజు ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి. పిండిని జల్లించి పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం సరిపడా నీళ్లు పోసి తీగ పాకం పట్టుకోవాలి. అందులో బియ్యం పిండిని వేసి బాగా కలిపి దించేయాలి. 
 
తరువాత స్టౌవ్‌ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె పోసి బాగా కాగాక పాకంలో కలిపి పెట్టుకున్న పిండిలో నువ్వులు చేర్చి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరిటాకుపై ఒత్తుకుని నూనెలో వేసి రెండువైపులా కాలి ఎరుపు రంగు వచ్చాక తీసేస్తే నువ్వుల అరిసెలు రెడీ.