శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 29 జూన్ 2017 (08:30 IST)

అయిదు రూపాయలకే భోజనం. ఇప్పుడు రూ. 1కే లీటర్ మినరల్ వాటర్..

గత సంవత్సర కాలంగా రూ. 5లకే భోజనంతో భాగ్యనగరంలో వేలాది మంది ఆకలి తీరుస్తోన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ వాసులకు రూ. 1కే సురక్షిత తాగునీటి కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు మినరల్ వాటర్ కేంద్రా

గత సంవత్సర కాలంగా రూ. 5లకే భోజనంతో భాగ్యనగరంలో వేలాది మంది ఆకలి తీరుస్తోన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ వాసులకు రూ. 1కే సురక్షిత తాగునీటి కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు మినరల్ వాటర్ కేంద్రాలను ఏర్పాటుచేయడానికి చర్యలు ప్రారంభించింది. 
 
పర్యావరణహిత సాంకేతికత, రసాయన రహిత శుద్ధి ప్రక్రియతో ముందుకొచ్చే సంస్థలకు మినరల్ వాటర్ కేంద్రాలను అప్పగించనున్నారు. నగరంలోని హాస్పిటల్స్, బస్టాపులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి కేంద్రాలను ఆగస్టు నెలలోపే ప్రారంభించడానికి జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతోంది.
 
సాధారణంగా ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ. 20. కొన్ని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి రూ. 5కి లీటర్ మంచినీళ్లు ఇస్తున్నారు. అయితే హైదరాబాద్ మహానగరంలో మాత్రం రూ. 1కే సురక్షిత తాగునీరు అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 
 
దీనికి గాను మే నెలలో జీహెచ్‌ఎంసీ ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అర్హతగల సంస్థల్ని ఎంపిక చేసి మరో నెల రోజుల్లో కేంద్రాలను ప్రారంభించనున్నారు. జోన్ల వారీగా 10-15 ప్రాంతాల్లో ఈ వాటర్ ప్లాంట్లను పెడతారు.