బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (17:20 IST)

సైకిల్ దిగేందుకు రేవంత్ రెడ్డి రెడీ.. టీఆర్ఎస్‌లోకి రేవంత్ అనుచరులు..

సైకిల్ దిగేందుకు రేవంత్ రెడ్డి రెడీ అయిపోయిన నేపథ్యంలో.. టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవ్వాలనుకున్న రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. రేవంత్ రెడ్డికి షాకిస్తూ ఆయన నియోజకవర్గంలోని పలువురు టీడీప

సైకిల్ దిగేందుకు రేవంత్ రెడ్డి రెడీ అయిపోయిన నేపథ్యంలో.. టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవ్వాలనుకున్న రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. రేవంత్ రెడ్డికి షాకిస్తూ ఆయన నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వారంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

రేవంత్ రెడ్డితో కలిసి విపక్షంలో చేరడం కంటే.. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఎంతో మేలని రేవంత్ అనుచరులంతా భావించినట్లు సమాచారం. ప్రతిపక్షంలో కూర్చుని అధికార పార్టీపై తిట్టిపోయడం కంటే.. టీఆర్ఎస్‌లో చేరి రాజకీయ భవిష్యత్తును చూసుకుంటే పోలా అని రేవంత్ రెడ్డి అనుచరులు భావిస్తున్నారు. 
 
మరోవైపు, రేవంత్ వ్యవహారశైలిపై టీటీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీ పరువు తీశారంటూ మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. త్వరలోనే ఆయన పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో రేవంత్ అనుచరులు తెరాసలోకి చేరడం ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. 
 
కాగా.. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో స‌మావేశం శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన‌ టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి విభిన్న అభిప్రాయాలు వెల్లడించారు. రావుల త‌మ పార్టీలో వ‌చ్చిన విభేదాల‌ను క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తమ స‌మావేశంలో అసలు రేవంత్ రెడ్డి అంశమే చ‌ర్చించ‌లేద‌ని అన్నారు.
 
ఈ స‌మావేశం నుంచి మోత్కుపల్లి మధ్యలోనే వెళ్లిపోయారన్న వార్తలో వాస్త‌వం లేద‌ని రావుల చెప్పారు. అయితే.. మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ, తాను సమావేశం జరుగుతుండగానే బయటకు వచ్చేశానని, రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన తీరు నచ్చలేదని చెప్పారు. అంతేగాక మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.