గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (19:31 IST)

'కత్తి' కలెక్షన్ల పరంపర.. రూ.82 కోట్లు క్రాస్... రూ.100 కోట్ల దిశగా...

తమిళ హీరో విజయ్ సమంత కాంబినేషన్‌లో ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'కత్తి'. ఈ చిత్రం వసూళ్లలో కోలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. ఎన్నో అవాంతరాలను అధిగమించి ఈ నెల 22వ తేదీన ఈ సినిమా తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెల్సిందే. 
 
అప్పటి నుంచి బుధవారానికి (29వ తేదీ వరకు) ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.82 కోట్లను వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ వారం ముగిసేలోపు రూ.100 కోట్లు కొల్లగొడుతుందని కోలీవుడ్ వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి. అదే కనుక నిజమైతే తమిళంలో ఈ ఏడాది భారీ విజయం సాధించిన సినిమా కూడా ఇదే అవుతుంది. 
 
ఇదే అంశంపై ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ మాట్లాడుతూ... నిస్సందేహంగా ఈ సంవత్సర తమిళ బ్లాక్ బాస్టర్ ఈ సినిమానే. తొలి వారంలోనే ఏకంగా రూ.82 కోట్లు వసూలు చేసింది. ఖచ్చితంగా రూ.వంద కోట్ల మార్కును చేరుకుని సరికొత్త రికార్డును సృష్టిస్తుందని పేర్కొన్నారు.