శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 1 అక్టోబరు 2014 (19:02 IST)

కలెక్షన్లు తగ్గిన లౌక్యం... గోవిందుడు దెబ్బేశాడా...

గోపీచంద్‌ చిత్రాలంటే ఒకప్పుడు బాగానే ఆడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన్ను చూడాలంటే కష్టంగా మారింది. అందుకు గత చిత్రాలే నిదర్శనం. ప్రస్తుతం ఆయన నటించిన 'లౌక్యం' సినిమా.. మొదటి మూడు రోజులు బాగానే కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం డ్రాప్‌ అయ్యాయి. 
 
వైజాగ్‌ ప్రాంతంలో బాగానే వున్నా.. మిగిలిన చోట్ల చాలా డల్‌గా వున్నా.. తాము ఆశించిన రాబడి లేదని కొందరు పంపిణీదారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఈ పండుగ సీజన్‌కు పబ్లిసిటీ పెంచాలని నిర్మాతను కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు తగినవిధంగా ఆయన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.