శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 30 అక్టోబరు 2014 (21:27 IST)

నాగచైతన్యను మళ్లీ మాతోనేనా అని అడిగిన సుధ... ఒక లైలా కోసం...

నాగచైతన్య హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నటించిన సినిమా 'ఒక లైలా కోసం'. ఈ చిత్రం ఇటీవల విడుదలై ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ పూజా హెగ్డే, దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, నటులు సుమన్‌, సత్యం రాజేష్‌, మధునందన్‌, అమిత్‌కుమార్‌, నటీమణులు సుధ, అన్నపూర్ణ, శ్యామల, కెమెరామెన్‌ ఐ.ఆండ్రూ, గేయరచయిత పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. 
 
నటీనటులంతా సినిమా గురించి మాట్లాడుతూ.... ఆహా.. ఓహో.. అనడమే కాకుండా అన్నపూర్ణ బేనర్‌లో చేయడం అదృష్టమనీ, ఇలాంటి బేనర్‌లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నామనీ తెగ పొగిడేశారు. తాత నుంచి మనవుడు నాగచైతన్య క్రమశిక్షణ, నటనతోపాటు మంచి అలవాట్లు పెద్దలను గౌరవించడం నేర్చుకున్నాడంటూ తెగ పొగిడేశారు. మరలా నాగచైతన్యతో నటించాలనే కోరికను వ్యక్తం చేస్తూ... మరోసారి అవకాశం ఇవ్వమని అడిగేశారు. 
 
అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ... ఇది లవ్‌స్టోరీయే కాదు, మంచి ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ మూవీగా అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఇలాంటి ఫీల్‌గుడ్‌ ఫామిలీ ఎంటర్‌టైనర్‌ రావాలంటే కంప్లీట్‌ ఫ్యామిలీ వుండాలి. థాంక్యూ టు 'ఒక లైలా కోసం' ఫ్యామిలీ. అన్నపూర్ణ స్టూడియోస్‌ 25వ చిత్రానికి ఇలాంటి ఫ్యామిలీ దొరకడం మా అదృష్టం. ఇదే ఫ్యామిలీతో త్వరలో మరో సినిమా చెయ్యాలని వుంది'' అన్నారు. అయినా.. నటి సుధ అనుమానం వ్యక్తం చేస్తూ... ఇదే ఫ్యామిలీ అంటే... మళ్ళీ మాతోనే కదా! అనే అనుమానాన్ని నివృత్తి చేసుకుంది.