శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: Hyderabad , శుక్రవారం, 12 మే 2017 (08:17 IST)

ప్రభాస్ లేకుండా రాజమౌళి భారీ చిత్రమా... సాధ్యమేనా?

మీడియాలో రిపోర్టులను బట్టి చూస్తే స్వల్ప విరామంలో ఉన్న రాజమౌళి మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లు ఏ కొత్త ప్రాజెక్టుకు ఒప్పుకోకుండా తనతో కలిసి ప్రయాణం చేసిన ప్రభాస్‌తోనే మళ్లీ సినిమా తీయాలా లేదా, బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌కు అవ

మీడియాలో రిపోర్టులను బట్టి చూస్తే స్వల్ప విరామంలో ఉన్న రాజమౌళి మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లు ఏ కొత్త ప్రాజెక్టుకు ఒప్పుకోకుండా తనతో కలిసి ప్రయాణం చేసిన ప్రభాస్‌తోనే మళ్లీ సినిమా తీయాలా లేదా, బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌కు అవకాశం ఇవ్వాలా అని రాజమౌళి ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం చిన్న విరామం తీసుకున్న రాజమౌళి.. త్వరలోనే కొత్త ప్రాజెక్టు స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నం కానున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషాల్లో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఫ్యాంటసీ అడ్వేంచర్‌గా తెరకెక్కనుంది.
 
ఇప్పటి వరకు రాజమౌళి తీసిన ఏ చిత్రమూ పరాజయం పొందకపోవడానికి కారణం.. తాను తీసే సినిమాల్లో వైవిధ్యం చూపించేందుకు ఆసక్తి చూపించడం. సరికొత్త కథని ప్రజలకు చూపించే లక్ష్యంతో సినిమాలు రూపొందించడమే. హిందీలో రణ్‌వీర్ సింగ్ సినిమాలను చూసిన రాజమౌళి తన తర్వాతి చిత్రానికి సరిగ్గా సరిపోతాడనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. అయితే, పని విషయంలో ప్రభాస్‌లో ఉన్నంత డెడికేషన్ రణ్‌వీర్‌లో ఉంటుందా అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.
 
రాజమౌళి వ్యక్తిగతంగా కూడా ఇష్టపడే వ్యక్తి ప్రభాస్. అతడి నుంచి కావాల్సిన నటనను రాబట్టుకోవడంలోను, అతడి కథపరంగా చూపించే హైప్‌కు సరైన వ్యక్తిగా ప్రభాస్ సరిపోతాడు. అంతేగాక, వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తారు. అయితే, రణ్‌వీర్‌ను తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు స్వాగతిస్తారనే సంకోచం కూడా రాజమౌళిని వెంటాడుతోంది. ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్‌ ప్రేక్షకుల మదిలో చక్కటి స్థానం ఏర్పరుచుకున్నాడు.  కాబట్టి హిందీ అభిమానుల కోసమే రణ్‌వీర్‌ను తీసుకోవాలనే ఆలోచన చేయబోరనే వాదనా వినిపిస్తోంది.
 
సాధారణంగా జక్కన్న ఒక పెద్ద చిత్రం తీసిన తర్వాత చిన్న చిత్రం చేస్తుంటారు. మరి, ఈ సారి చిన్న చిత్రం తీశాక.. ఈ పెద్ద ప్రాజెక్టు గురించి ఆలోచిస్తారా, లేదా ‘బాహుబలి’ని మించిన భారీ బడ్జెట్ చిత్రానికి సిద్ధమవుతారా అనేది త్వరలోనే తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ లేకుండా భారీ ప్రాజెక్టు సినిమా రాజమౌళి నుంచి వస్తుందా అన్నదే సందేహం.