గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (16:42 IST)

'థాంక్యూ వెరీమ‌చ్ అన్నా' .. జూనియర్ ఎన్టీఆర్‌ ట్వీట్‌కు కొరటాల స్పందన

"థ్యాంక్యూ వెరీ మచ్ అన్నా" అంటూ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ప్రసంశలు దర్శకుడు కొరటాల శివను ఉద్దేశించి చేసినవి కావడం గమనార్హం. తాజాగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అనే న

"థ్యాంక్యూ వెరీ మచ్ అన్నా" అంటూ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ప్రసంశలు దర్శకుడు కొరటాల శివను ఉద్దేశించి చేసినవి కావడం గమనార్హం. తాజాగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీలు హీరోహీరోయిన్లు. ఏప్రిల్ 20వ తేదీన రిలీజైన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
 
ఈ చిత్రం విజయంతో దర్శకుడు కొరటాల శివ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలుత మహేష్ బాబు హీరోగా 'శ్రీమంతుడు' చిత్రాన్ని తీయగా, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'జనతా గ్యారేజ్' చిత్రాన్ని నిర్మించాడు. ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్. తాజాగా వచ్చిన "భరత్ అనే నేను" కూడా ఘన విజయం సాధించింది. 
 
ఈ చిత్రాన్ని సామాన్యులేకాకుండా సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ఇష్టపడుతూ, ప్రశంసల వర్షం కురిపిస్తూ ఎంతో మంది సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శంసించారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ కూడా ఈ సినిమాను ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ట్వీట్‌కు స్పందిస్తూ.. 'థాంక్యూ వెరీ మ‌చ్ అన్నా' అని కొర‌టాల స‌మాధానం ఇచ్చారు. ఎన్టీయార్‌తోపాటు ఈ సినిమాను ప్ర‌శంసించిన‌ రామ్‌చ‌ర‌ణ్‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌, వంశీ పైడిప‌ల్లి, రాజ‌మౌళిల‌కు కొరటాల శివ ధన్య‌వాదాలు తెలియ‌జేశారు.
 
ఇదిలావుంటే, మొద‌టిసారి పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్ క‌థ‌లో న‌టించి భారీ విజ‌యాన్ని అందుకున్న భరత్ అనే నేను చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తార‌క రామారావు వీక్షించారు. చిత్రయూనిట్ కేటీఆర్ కోసం ప్ర‌త్యేకంగా ఓ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఏర్పాటు చేసింది. నిర్మాత దాన‌య్య‌, మ‌హేష్‌బాబు, కొర‌టాల శివతో క‌లిసి కేటీఆర్ సినిమా చూశారు. సినిమా బాగా న‌చ్చ‌డంతో కేటీఆర్‌.. మ‌హేష్, కొరటాల శివ‌ను అభినందించారు. సినిమాను అభినందిస్తూ ట్వీట్ చేశారు. సినిమాను చాలా ఎంజాయ్ చేశాన‌ని, స్నేహితుడు మ‌హేష్‌, డైరెక్ట‌ర్ కొరటాల శివ‌తో మాట్లాడాన‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.