Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ పెళ్ళి పత్రికను జాగ్రత్తగా దాచుకున్న మెగాస్టార్.. ఎందుకో తెలుసా...

బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (10:41 IST)

Widgets Magazine
wedding - chiru

ఎంత పెద్ద ప్రముఖుడైనా తనకు సంబంధించిన జ్ఞాపకాలను జాగ్రత్తగా దాచుకోవాలని భావిస్తాడు. అలాంటివారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. నిజమే. తన పెళ్ళి పత్రికను ఇప్పటికీ అతి జాగ్రత్తగా తన ఇంటిలో లామినేషన్ చేసుకుని మరీ దాచిపెట్టుకునివున్నారు. ఇది నిజమే. చిరంజీవికి వివాహమై సరిగ్గా ఈనెల 20వ తేదీతో 38 సంవత్సరాలు. 
 
1980 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన చెన్నైలోని ఎల్లీస్ రోడ్డులో చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. ముహూర్తం అదేరోజు ఉదయం 10.50 నిమిషాలకు, రిసెప్షన్ 6 నుంచి 8 గంటల మధ్య, డిన్నర్ రాత్రి 8 గంటలకు జరిగినట్లు శుభలేఖలో ఉంది. 
 
ప్రముఖ హాస్యనటుడు, దివంగత నేత అల్లు రామలింగయ్య పెళ్ళికి ఆహ్వానిస్తున్నట్లుగా పెళ్ళి పత్రికలో ఉంది. దీన్ని ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా దాచుకున్నారు చిరంజీవి. మంగళవారం ఆయన పెళ్ళిరోజు కావడంతో ఇంటిలో ల్యామినేషన్ చేసి ఉంచిన పెళ్ళిపత్రికను చూసి ఆశ్చర్యపోయారట మెగా కుటుంబ సభ్యులు. 
 
ఇన్ని యేళ్ళయినా ఇంత జాగ్రత్తగా ఎలా పెట్టుకున్నారంటూ చిరంజీవి ప్రశ్నించారట ఆయన కుమారుడు, హీరో రాంచరణ్. జీవితంలో మరుపురాని సంఘటన ఏదైనా ఉంటే నేను మొదటగా చెప్పేది ఇదేనంటూ తన కుమారుడు చరణ్‌కు చెప్పుకొచ్చారట చిరంజీవి. ఆ పత్రిక మీరు కూడా చూడండి...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పద్మావతి అంటే ఇష్టం.. ప్రియా ప్రకాష్ వారియర్

బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్‌తో పాటు రణ్‌వీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి హీరోలంటే చాలా ...

news

విజయ నిర్మల @ 73... పుట్టినరోజు శుభాకాంక్షలు...

నటి, దర్శకురాలు విజయ నిర్మల 73వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాదులోని ఆమె స్వగృహంలో ఘనంగా ...

news

అందం, శాలరీ కోసం కక్కుర్తి పడకండి.. ఆరాతీయండి: విజయ్ దేవరకొండ

సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న వేళ.. తెలంగాణ సర్కారు.. సెలెబ్రెటీల చేత యువత, ప్రజల్లో ...

news

నా బెల్లీని స్లో మోషన్‌లో చూపించారు.. అందాల వస్తువుగా?: ఇలియానా

11 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో వున్న అందాల భామ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం ...

Widgets Magazine