శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2016 (12:25 IST)

దర్శకుడి లైంగిక వేధింపులు.. తమిళ హీరోయిన్ ఆత్మహత్యాయత్నం

ఓ దర్శకుడి వేధింపులను తట్టుకోలేక ఓ తమిళ నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. మలయాళంలో పలు సీరియళ్లలో నటించిన అదితి అలియాస్ అథిరా సంతోష్ తమిళంలో ఓ తమిళ చ

ఓ దర్శకుడి వేధింపులను తట్టుకోలేక ఓ తమిళ నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. మలయాళంలో పలు సీరియళ్లలో నటించిన అదితి అలియాస్ అథిరా సంతోష్ తమిళంలో ఓ తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. అయితే.. ఆ సినిమా డైరెక్టర్ సెల్వ కన్నన్ నుంచి ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొంది. శారీరకంగా, మానసికంగా తనను విపరీత ధోరణిలో వేధించాడని అదితి ఆరోపించింది. వాస్తవానికి సెప్టెంబరు 29న ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని వాట్సాప్‌లో మెసేజ్ చక్కర్లు కొట్టింది. దీంతో దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఆస్పత్రిలో ఆమె సెల్వకన్నన్‌తో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియాకు తెలియజేసింది. సినిమా మొదలైన నాటి నుంచి సెల్వకన్నన్ తనను వేధిస్తున్నాడని చెప్పింది. పదేపదే సెల్వ కన్నన్ తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడని, ప్రేమను నిరాకరిస్తే బెదిరించేవాడని తెలిపింది. అతడి ప్రేమను తిరస్కరించినప్పట్నుంచి సెల్వకన్నన్ వేధింపులు ఎక్కువయ్యాయని, ఓ సారి తనను గదిలో కూడా నిర్బంధించాడని విలపించింది. ఎలాగోలా తప్పించుకుని కేరళలోని తన ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. దానిపై అటు పోలీసులకు, నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది.