గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 30 జనవరి 2017 (01:27 IST)

పాకిస్తాన్‌పై భారతీయులు గర్వపడే విజయం 'ఘాజీ ది అటాక్'

1971లో జరిగిన భారత-పాకిస్థాన్‌ యుద్ధంలో భారతీయ నౌకాదళం కీలకమైన పాత్ర పోషించింది. విశాఖపట్నంలోని ఈస్ట్రన్‌ కమాండ్‌ అధీనంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత అనే యుద్ధనౌకపై దాడి చేసి మన నౌకాదళాన్ని దెబ్బతీయటానికి.. పాకిస్థాన్‌ పీఎన్‌ఎస్‌ ఘాజీ అనే ఒక జలాంతర్గామిన

మన దేశంలో నావికాదళ సిబ్బంది ప్రధాన పాత్రలుగా వచ్చిన సినిమాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. హీరో రానా నటించిన ‘ఘాజీ-ది అటాక్‌’ కూడా అలాంటి అరుదైన చిత్రమే! ఆ చిత్ర నేపథ్యం ఏమిటి? 1971లో జరిగిన భారత-పాకిస్థాన్‌ యుద్ధంలో భారతీయ నౌకాదళం కీలకమైన పాత్ర పోషించింది. విశాఖపట్నంలోని ఈస్ట్రన్‌ కమాండ్‌ అధీనంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత అనే యుద్ధనౌకపై దాడి చేసి మన నౌకాదళాన్ని దెబ్బతీయటానికి.. పాకిస్థాన్‌ పీఎన్‌ఎస్‌ ఘాజీ అనే ఒక జలాంతర్గామిని విశాఖపట్నానికి పంపింది. ఆ సమయంలో పాక్‌ దగ్గర నాలుగు జలాంతర్గాములు ఉండేవి. ఐఎన్‌ఎస్‌ విక్రాంతను దెబ్బతీయగలిగితే.. యుద్ధంలో పై చేయి సాధించవచ్చని పాక్‌ సైన్యం చాలా ఆశలు పెట్టుకుంది. 
 
ఘాజీ అతి రహస్యంగా.. భారతీయ నౌకలకు చిక్కకుండా విశాఖపట్నం సమీపానికి చేరుకుంది. కానీ అప్పటికే ఐఎన్‌ఎస్‌ విక్రాంత విశాఖతీరాన్ని వదిలివెళ్లిపోయింది. దీంతో ఒక ప్రత్యేకమైన లక్ష్యం లేని ఘాజీ.. విశాఖపట్నం సమీపంలో ఉన్న నౌకలపై దాడులు చేయటానికి విఫలయత్నాలు చేసింది. 
 
1971, డిసెంబర్‌ 3వ తేదీన ఐఎన్‌ఎస్‌ అక్షయ్‌ అనే యుద్ధనౌక పహారా కాయడానికి వెళ్లినప్పుడు ఘాజీ శకలాలు దొరికాయి. ఈ శకలాలు దొరికే దాకా.. ఈ జలాంతర్గామి గురించి మన నౌకదళానికి తెలుసా.. లేదా.. అనే విషయంపై కూడా స్పష్టత లేదు. పేలుడు వల్ల ఘాజీ ముక్కలు ముక్కలైపోయిందని ఆ తర్వాత జరిగిన విచారణలో తేలింది. 
 
తాము ఘాజీని పేల్చివేశామని.. మన నౌకాదళం ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఘాజీ పేలుడు ఎలా జరిగిందనే విషయం ఇప్పటికీ తెలియదు. 
 
1971 డిసెంబర్‌ 3న జరిగిన సంఘటన ఇది. ఇండియా, పాక్‌ల మధ్య యుద్ధం జరిగే ముందు విశాఖ తీరంలో ‘ఘాజీ’ ముక్కలైంది. ఆ యుద్ధనౌకను కూల్చేసే క్రమం ఆసక్తికరంగా సాగుతుంది. ఇదొక ఉద్వేగభరిత కథ. పాకిస్తాన్‌పై భారతీయులు గర్వపడే విజయం. ‘ఘాజీ’కి పెడుతున్న బడ్జెట్‌తో ఏ వాణిజ్యచిత్రమో చేయవచ్చు. కానీ ఇలాంటి కొత్త చిత్రం ఎవరూ చేయలేరు
 
ఘాజీ సినిమా ట్రైలర్‌ ఆధారంగా చూస్తే- భారతీయ నౌకదళ సిబ్బంది.. 18 రోజులు ఘాజీని వెతుకుతూ వెళ్తారు. ఆ సమయంలో ఏమవుతుందనేదే ప్రధానమైన కథ.