గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (10:24 IST)

వెండితెరపై మరో అద్భుతం.. నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు కలిపితే.. "రారండోయ్ వేడుక చూద్దాం"

నాగార్జున కెరీర్లో శివ ఒక ట్రెండ్ సెట్టర్ అయితే, నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు అత్యద్భుతమైన కుటుంబ గాధా చిత్రాలు. రెండు తరాల ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగంలో ముంచెత్తిన గొప్ప చిత్రాలవి. మరి ఇన్నాళ్ల తర్వాత ఈ రెండు సినిమాలు కలిపి ఒక సినిమాను రూపొందిస్తే.

నాగార్జున కెరీర్లో శివ ఒక ట్రెండ్ సెట్టర్ అయితే, నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు అత్యద్భుతమైన కుటుంబ గాధా చిత్రాలు. రెండు తరాల ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగంలో ముంచెత్తిన గొప్ప చిత్రాలవి. మరి ఇన్నాళ్ల తర్వాత ఈ రెండు సినిమాలు కలిపి ఒక సినిమాను రూపొందిస్తే... ఈ ఆలోచన కూడా నాగార్జునదే. ఫలితం త్వరలో మనముందుకు రాబోతున్న ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రం.  అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న.. నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విశేషాలను చిత్రబృదం మీడియాతో ముచ్చటించింది. చిత్రంగురించి నిర్మాత నాగార్జున ఏమన్నారో తన మాటల్లోనే చూద్దాం.
 
‘ఒకమ్మాయి తనకొచ్చే భర్త రాకుమారుడిలా ఉండాలని కలలుగంటుంది. ఆ రాకుమారుడు ఎవరు ఎలా ఉంటాడు ఆ అమ్మాయి కల నెరవేరిందా లేదా అన్నదే చిత్ర కథ. నాకు బాగా నచ్చిన రొమాంటిక్‌ చిత్రాలు ‘నిన్నే పెళ్లాడతా’, ‘మన్మథుడు’. కుటుంబ బంధాలు, ఎమోషన్‌ సీన్స్‌ ‘నిన్నే పెళ్లాడతా’లో చూపించాం. ఇక ‘మన్మథుడు’లో ఎంటర్‌టైనమెంట్‌తో పాటు సెన్సిటివ్‌ లవ్‌ని చూపించాం. ఆ రెండింటినీ కలిపి ఓ సినిమా చేస్తే బాగుంటుందని కల్యాణ్‌తో చెప్పా. మంచి కథాంశం చెప్పాడు. కథ వినగానే బాగా నచ్చింది. జగపతిబాబు చైతన్య తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య ఉండే బంధాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. నిజ జీవితంలో నేను చైతూ ఎలా ఉంటామో సినిమాలో ఆ రెండు పాత్రలూ అలా ఉంటాయి. సంపత్‌ కూతురిగా రకుల్‌ నటించింది. ఒకరంటే ఒకరికి ప్రాణం. అంతబాగా వారిద్దరి పాత్రలు ఉంటాయి. ఈ సినిమాకు ఈ నాలుగు పాత్రలు హైలెట్‌గా నిలుస్తాయి. దేవిశ్రీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎప్పటిలాగే ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ అందించాడు. డైరెక్టర్‌గా కంటే కల్యాణ్‌ మంచి రచయిత. అందుకే అతడ్ని ‘సోగ్గాడే చిన్నినాయనా’కి తీసుకున్నాం’అని చెప్పారు. 
 
ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే మూడో వారంలో సినిమా విడుదల చేస్తామని నాగ్‌ చెప్పారు.