గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 8 జనవరి 2016 (14:22 IST)

అది వర్మక్కూడా తెలీదు... కానీ టచ్ చేశాడు.. 'కిల్లింగ్ వీరప్పన్' రివ్యూ

కిల్లింగ్ వీరప్పన్ అయింది... వంగవీటి సినిమాకు వర్మ

కిల్లింగ్ వీరప్పన్ నటీనటులు : శివరాజ్‌ కుమార్‌, సందీప్‌ భరద్వాజ్‌, పరుల్‌ యాదవ్‌ తదితరులు; నిర్మాత : మంజునాథ్‌, సంగీతం : సాండీ, దర్శకత్వం : రామ్‌ గోపాల్‌ వర్మ.
 
రామ్‌గోపాల్‌ వర్మ వివాదాస్పద దర్శకుడు. తను ఎంచుకునే కథలు కూడా అలాంటివే. పరిటాల రవి నేపథ్యంలోని కథలు సినిమాలు తీసి రక్తచరిత్రలు సృష్టించిన ఆయన ఈసారి ఏకంగా.. జాతీయస్థాయిలో చర్చకు తావిచ్చిన వీరప్పన్‌ కథను ఎంచుకున్నాడు. అందుకు అతని భార్యను కూడా సంప్రదించాడు. కానీ సినిమా చూశాక.. అసలు కథ ఇది కాదని ఆమె గొడవ చేయడం.. కొద్దికాలం సినిమా వాయిదా పడటం జరిగింది. విడుదలవుతున్న సమయంలో.. తెలుగులో సెన్సార్‌ ప్రాబ్లమ్‌ వచ్చింది. కన్నడలో అప్పటికే విడుదలై అక్కడివారికి నచ్చేలా చేసింది. జనవరి 1న విడుదల కావాల్సిన సినిమా 7వ తేదీకి విడుదలయింది. మరి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గజగజా వణికించిన స్మగ్లర్‌ వీరప్పన్‌ కథ ఏంటి, అతనిని ఎలా చంపారు? అనేది వర్మ ఎలా చూపించాడో చూద్దాం.
 
 
కథ :
వీరప్పన్‌ (సందీప్‌ భరద్వాజ్‌) ఓ ఒప్పందం కోసం బయటకి వస్తున్నాడని తెలిసి ఓ ఫారెస్ట్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ టీం బయలుదేరుతుంది. విషయం గ్రహించిన వీర్పన్‌ వారిని మట్టుపెట్టేస్తాడు. దాంతో కసితో అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని డిపార్ట్‌మెంట్‌ ఆలోచిస్తుంది. స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌‌కి సంబంధించిన విజయ్‌ కుమార్‌ ఆలోచిస్తుండగా.. విజయ్‌ కుమార్‌ అసిస్టెంట్‌, ఎస్‌.పి(శివరాజ్‌ కుమార్‌) ఓ ప్లాన్‌ చెప్తాడు. సారాంశం ఏమంటే.. అతన్ని అడవిలో ఏమీ చేయలేం. అక్కడనుంచి బయటకు తీసుకురాగలితే చాలు.. ఇట్టే పట్టేస్తామంటాడు. ఆపరేషన్‌ కకూన్‌తో ఎలా ప్లాన్‌ చేశాడు? అతడిని ఎలా పట్టుకోవడానికి ఎవర్ని ఎరగా చేసుకున్నారు? అనేది సినిమా.
 
 
నటీనటులు:
కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించాడు. కన్నడిగులకు ఆయన నటన తెలుసు. పోలీసు పాత్ర గనుక అన్నీ ఎమోషన్స్‌ వుంటాయి. శివరాజ్‌ కుమార్‌ దాన్ని బాగా పండించాడు. ఢిల్లీకి చెందిన స్టేజీ నటుడు భరద్వాజ బాగా నటించాడు. క్రూరత్వం చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు.  వీరిద్దరే సినిమాకు కీలకం.  వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి పాత్రలో చేసిన యజ్ఞ శెట్టి నటనతో పాటు సినిమాటిక్‌గా కొన్ని లుక్స్‌ వర్మ వినియోగించాడు. ప్రధానంగా బయట వీరప్పన్‌ని చంపిన తరహాలోనే ఇందులో చంపినట్లు చూపిస్తాడు. మిగిలిన పాత్రలు బాగానే చేశాయి.
 
టెక్నికల్‌గా..
ఈ కథకు సినిమాటోగ్రఫీ కీలకం. ప్రతి సినిమాకు కొత్త టెక్నికల్‌ పరిచయం చేసే వర్మ.. ఈసారి రమ్మి సినిమాటోగ్రఫీనే వాడాడు. ఫారెస్ట్‌ ఎపిసోడ్‌కు ఇది ప్రత్యేకం. ఆ తర్వాత సంగీతం చేసిన రాజశేఖర్‌, రవిశంకర్‌, మున్నాకాశీ, సునీల్‌ కశ్యప్‌‌లు కలిసి పాటలు మొత్తంగా వింటే... వర్మ గత చిత్రాల్లో తరహాలోనే అనిపిస్తాయి. ముఖ్యంగా సౌండింగ్‌ సిస్టమ్‌లో నిష్ణాతుడైన వర్మ.. అడవిలో సైలెన్స్‌.. షడెన్‌ కాల్పులు.. ఎదురుదాడిలు వంటివి సౌండింగ్‌లో రియలిస్టిక్‌గా చూపించాడు. దీన్ని సాండీ సినిమా స్టార్టింగ్‌లో వీరప్పన్‌ ఎపిసోడ్స్‌‌కి బాగా మ్యూజిక్‌ ఇచ్చాడు. కానీ ఆ ఆ తర్వాత చాలా కీలక సన్నివేశాల్లో బాగా పేలవమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. రఘు కులకర్ణి ఆర్ట్‌ వర్క్‌, లొకేషన్‌ సెలక్షన్‌ బాగుంది. అన్వర్‌ అలీ ఎడిటింగ్‌ పర్వాలేదు.
 
విశ్లేషణ:
వీరప్పన్‌ సినిమా అంటే.. ఆయన గురించి వాళ్లువీళ్లు చెప్పడం.. రాయడం మినహా.. అసలు చరిత్ర ఇలా వుంటుందనేది వర్మక్కూడా తెలీదు. ఏదో క్రేజ్‌ ప్రాజెక్ట్‌ అవుతుందని తీసేశాడు. వీరప్పన్‌ చరిత్రలో రాజకీయ కోణాలున్నాయి. అవేవి అస్సలు టచ్‌ చేయకుండా.. కేవలం ఆయన్ను చంపడం.. అనేది టార్గెట్‌గా పెట్టుకుని.. ఎందుకు స్మగ్లింగ్‌ చేశాడు? దీని వెనుక ఎవరు వున్నారు? అనే విషయాల్లో స్పష్టత లేకుండా తీసేశాడు. సహజంగా.. అడవిలో వుండేవారు సాధువులా ఉండరు. క్రూరంగా వుంటారు. దాన్ని బాగా చూపించాడు. ఇంత క్రూరమైన వాడా వీరప్పన్‌ అనే ఫీలింగ్‌‌ని క్రియేట్‌ చేయడంలో వర్మ సక్సెస్‌ అయ్యాడు. ఆయనకో లవ్‌ స్టోరీ.. దాన్ని బాగానే తీశాడు.  
 
ఎప్పుడైతే.. పోలీసు- వీరప్పన్‌ మధ్య కథ నడుస్తుందో... సహజంగా పోలీసు డామినేషన్‌ వుంటుంది. ఇందులో అదే జరిగింది. ఇది కేవలం.. కన్నడ సినిమా. తెలుగులో డబ్‌ చేశాడు. కన్నడ స్టార్‌ కాబట్టి.. ఆయన్ను హైలైట్‌ చేశాడు. ఇక వీరప్పన్‌‌ని పోలీసులు చంపిన మిషన్‌ గురించి ఇంచుమించు అందరికీ తెలిసిందే. దాని వలన సెకండాఫ్‌‌లో తెలిసిన దాన్నే ఎందుకు చూపిస్తున్నారు అనే ఫీలింగ్‌ కూడా కలుగుతుంది. క్రమేణా బోర్‌ వైపు దారితీస్తుంది కూడా. చంపడమే కాన్సెస్ట్‌ అయినా దాన్ని సాగదీతగా లెంగ్త్‌ ఎక్కువ అవ్వడం, కథనంలో ఫుల్‌ గ్రిప్‌ లేనందు వల్ల చాలాచోట్ల బోర్‌ కొడుతుంది. భార్య ముత్తు లక్ష్మి పాత్ర పోలీసులకి సపోర్ట్‌ చేసింది అనే విషయాలను గురించిన క్లారిటీ ఇవ్వలేదు. 
 
 
అలాగే సెకండాఫ్‌ ప్రీక్లైమాక్స్‌ దగ్గరలో వీరప్పన్‌‌కి అసలు పొలిటికల్‌‌గా ఎలాంటి సపోర్ట్‌ లేదు, తనకి ఎలాంటి సపోర్ట్‌ లేక ఒకరి సపోర్ట్‌ కోసం ఆరాటపడుతుంటాడు అనే పాయింట్‌ అస్సలు నమ్మశక్యంగా లేదు. ఎర్రమట్టి దిబ్బల్లో వీరప్పన్‌‌ని అడ్డుకోవాలని ప్లాన్‌ చేసి దానిని అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యేలా డీల్‌ చేసిన సీన్‌ చాలా సిల్లీగా అనిపిస్తుంది. వీరప్పన్‌ లైఫ్‌ లోని ఇన్సిడెంట్స్‌‌ని కూడా జత చేసి కథని రాసుకొని ఉంటే ప్రజల్లో హీరోగా నిలిచేవాడేమో. 'రక్త చరిత్ర' తరహాలో కొన్ని సినిమాటిక్‌ అంశాలను జోడించి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఓ మేరకు ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
 
రేటింగ్‌- 2.5/5