గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 3 మార్చి 2017 (20:44 IST)

కుక్క పిల్లల్ని కిడ్నాప్ చేసే కిట్టుగాడు... రాజ్ తరుణ్ సినిమా ఎలా వుందంటే?

రాజ్‌ తరుణ్‌.. జాగ్రత్తగా కథలు ఎన్నుకుని చిత్రాలు చేస్తున్నాడు. కథనంలో కూడా తగు సూచనలు చేస్తూ.. సినిమాను ఎలాగైనా హిట్‌ కొట్టాలన్న ఆలోచనతో వుంటాడు. అలాంటి వ్యక్తి ఈసారి ఓ ఆంగ్ల సినిమా నేపథ్యంగల కథను ఎన్నుకున్నాడు. కుక్కల పిల్లల్ని కిడ్నాప్‌ చేసే కుర్ర

కిట్టుగాడు నటీనటులు : రాజ్‌తరుణ్‌, అను ఇమ్మాన్యుయల్‌, పృథ్వీ, రఘుబాబు తదితరులు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత: అనిల్‌ సుంకర, దర్శకత్వం: వంశీ కష్ణ
 
రాజ్‌ తరుణ్‌.. జాగ్రత్తగా కథలు ఎన్నుకుని చిత్రాలు చేస్తున్నాడు. కథనంలో కూడా తగు సూచనలు చేస్తూ.. సినిమాను ఎలాగైనా హిట్‌ కొట్టాలన్న ఆలోచనతో వుంటాడు. అలాంటి వ్యక్తి ఈసారి ఓ ఆంగ్ల సినిమా నేపథ్యంగల కథను ఎన్నుకున్నాడు. కుక్కల పిల్లల్ని కిడ్నాప్‌ చేసే కుర్రాడిగా కన్పించాడు. అందుకే 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' అనే భిన్నమైన టైటిల్‌తో ముందుకు వచ్చాడు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్‌తో పలు విజయవంతమైన చిత్రాలు తీసిన అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. మరి అది ఎలా వుందో చూద్దాం. 
 
కథ :
గ్యారేజ్‌ నడుపుకునే కిట్టు(రాజ్ తరుణ్) డబ్బు కోసం కుక్కల్ని కిడ్నాప్‌ చేసే పని మొదలుపెడతాడు. అప్పటికే జానకి (అను ఇమ్మాన్యుయేల్‌) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే కుక్కల్ని కిడ్నాప్‌ చేస్తున్న విషయం జానకికి తెలిసి అతనికి దూరమైపోతుంది. దీంతో దిగాలుగున్న తరుణంలో జానకిని ఓ క్రిమినల్‌ (అర్బాజ్‌ ఖాన్‌) కిడ్నాప్‌ చేస్తాడు. ఇక కుక్కల్ని పక్కనపెట్టి.. తన జానకిపై దృష్టిపెడతాడు కిట్టు. మరోవైపు కిట్టు వెంట పోలీసులు పడుతుంటారు. వారి నుంచి తనెలా తప్పించుకున్నాడు. తన జానకి కోసం తనేం చేశాడు. అసలు జానకి ఎవరు? పోలీసులు కిట్టు వెంట ఎందుకు పడుతుంటారు? అనేవాటికి సమాధానమే మిగిలిన సినిమా.
 
విశ్లేషణ :
హీరో ఎంత చేసినా.. కమేడియన్స్‌ పెట్టి ఎంటర్‌టైన్‌ చేయడం దర్శకుల పని. ఇందులో సెకండాఫ్‌లో పృథ్వి పండించే కామెడీ హైలైట్‌. రేచీకటి కాన్సెప్ట్‌తో దర్శకుడు ఎంచుకున్న సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సెకండాఫ్‌లో పృథ్వి నటన, అతని పాత్రకు ఇంకొన్ని రౌడీ పాత్రలకు మధ్య నడిచే సన్నివేశాలు, సంభాషణలు చాలా బాగున్నాయి. అసలు కథ ప్రకారం.. హీరో కుక్కల్ని కిడ్నాప్‌ చేయడం సిల్లీగానే ఉన్నా స్క్రీన్‌ మీద మాత్రం మెప్పించేదిగా వుంది. వాటిని కాస్త ఫన్నీగా చిత్రీకరించడం బాగుంది.
 
దర్శకుడు వంశీ కృష్ణ ఫస్టాఫ్‌ మొత్తాన్ని ఫర్వాలేదనిపించేలా నడిపినా ఇంటర్వెల్‌ సస్పెన్స్‌ను మాత్రం చాలా ఆసక్తికరంగా, ఊహించని విధంగా ప్లాన్‌ చేసి మంచి థ్రిల్‌ ఇచ్చాడు. దాంతో సెకండాఫ్‌లో ఏం జరుగుతుందో అనే ఆసక్తి రేకెత్తిచడంలో పూర్తిగా సక్సెస్‌ అయ్యాడు. ఇక హీరో, హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ అక్కడక్కడా కాస్త రొటీన్‌గా అనిపించినా అను ఇమ్మాన్యుయేల్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ వలన చాలా చోట్ల ఇంప్రెస్‌ చేసింది. హీరో స్నేహితులుగా ప్రవీణ్‌, సుదర్శన్‌ నటన, విలన్‌ అర్బాజ్‌ ఖాన్‌ నైపథ్యం, అతని నటన, రాజ్‌ తరుణ్‌ ఎనర్జిటిక్‌ బాగున్నాయి.
 
ఇక కథలో ప్రధాన లోపాలుగా కొన్ని వున్నాయి. కథనం స్లోగా వుంది. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్‌ బాగున్నాయనిపించేలోపు ప్రభాకర్‌ రౌడీ బ్యాచ్‌ మీద నడిచే కొన్ని రొటీన్‌ సీన్లు బోర్‌ తెప్పించాయి. అంతేగాక కథనం ఇంటర్వెల్‌ ముందు వరకు కాస్త సాదాసీదాగానే నడవడంతో సంథింగ్‌ మిస్సింగ్‌ అనే భావన కలిగింది. అలాగే ఫస్టాఫ్‌ నుండి సినిమా ఎండింగ్‌ వరకు మధ్యలో తగిలే రఘు బాబు, వెన్నెల కిషోర్ ట్రాక్‌ ఆశించిన స్థాయిలో కామెడీని పండించకపోవడమే గాక కథానానికి కూడా అడ్డు తగులుతున్నట్లు అనిపించింది. అసలు కథన పక్కన పెట్టి.. కిడ్నాప్‌ అయిన తన ప్రేయసి కోసం వెతికే.. కిట్టును కథకు మిగిలిన కమేడియన్స్‌ జోడించి.. దర్శకుడు డైవర్ట్‌ చేశాడు. మరలా ఓ కొలిక్కి వచ్చి మెయిన్‌ ట్రాక్‌లో ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూడాల్సి వచ్చింది.
 
టైంపాస్‌ సినిమాలా సాగిపోయే ఈ కథను సరదాగా చూసే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌తో పాటు ఆసక్తికరమైన ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, సరదాగా సాగే సెకండాఫ్‌ కథనం, పిచ్చిగా నవ్వించే పృధ్వి కామెడీ ఈ సినిమాలో ప్లస్‌ పాయింట్స్‌ కాగా లవ్‌ ట్రాక్‌, ప్రభాకర్‌ గ్యాంగ్‌, రఘుబాబు, వెన్నెల కిషోర్ల ట్రాక్‌‌లలో వచ్చే రొటీన్‌ సన్నివేశాలు, విలన్‌ పాత్రకు బలమైన ఎండింగ్‌ లేకపోవడం ఇందులో మైనస్‌ పాయింట్స్‌.
 
సాంకేతిక విభాగం :
ఇది సింపుల్‌ కథ. శ్రీకాంత్‌ విస్సా స్టోరీలైన్‌ రొటీన్‌ అయినా దానికి దర్శకుడు కుక్కల కిడ్నాప్‌ అనే నేపధ్యానికి పృథ్వి కామెడీని, మంచి కథనాన్ని జోడించి సినిమాను ప్రేక్షకులకు కావాల్సిన విధంగా బాగానే తయారుచేశాడు. ఇక అనూప్‌ రూబెన్స్‌ సంగీతం ఫర్వాలేదు. బి. రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను అందంగా కనిపించేలా చేసింది. ఎంఆర్‌ వర్మ ఎడిటింగ్‌ బాగుంది. అనిల్‌ సుంకర నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.
 
రేటింగ్ ‌: 3/5