శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (17:18 IST)

వాస్తు టిప్స్: స్టడీ రూమ్‌కు లైట్ గ్రీన్ కలర్ ఎందుకో తెలుసా?

ఇంటిలోపల, వెలుపల వేసే రంగులు ఆ ఇంట నివసించే వారికి.. బయటి నుంచి చూసేవారికి ఆహ్లాదకరాన్ని, ప్రశాంతతను ఇస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంటి గోడలకు ఉపయోగించే రంగుల ద్వారా మనశ్శాంతి లభిస్తుందని వారు

ఇంటిలోపల, వెలుపల వేసే రంగులు ఆ ఇంట నివసించే వారికి.. బయటి నుంచి చూసేవారికి ఆహ్లాదకరాన్ని, ప్రశాంతతను ఇస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంటి గోడలకు ఉపయోగించే రంగుల ద్వారా మనశ్శాంతి లభిస్తుందని వారు చెప్తున్నారు. అందుకే గోడకు వెలుపల.. అంటే బయటి నుంచి మన ఇంటిని చూసే వారి కంటికి మేలు కలిగేలా.. తెలుపు రంగును ఉపయోగించమంటున్నారు. 
 
భవనానికి లేదా ఇంటికి బయటి గోడలకు తెలుపు లేదా లేత పసుపు రంగును పెయింట్ చేయవచ్చును. అలాగే ఇంట్లోని హాలు గోడలకు ఆఫ్ వైట్ కలర్‌ను ఎంచుకోవాలి. పడకగదికి లైట్ బ్లూ కలర్ ఉపయోగించాలి. వంటగదికి లైట్ ఆరెంజ్ రంగుతో పెయింటింగ్ చేసుకుంటే.. శుభ ఫలితాలుంటాయి. ఇక స్టడీ రూమ్‌కు లైట్ గ్రీన్ కలర్‌ను ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలను రాబడుతారని వాస్తు నిపుణులు అంటున్నారు.