శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (15:52 IST)

ఎముకల బలం కోసం హెల్దీ డ్రింక్.. ఎలా చేయాలంటే?

పిల్లలకు ఎముకలు బలపడాలంటే? 30ఏళ్లు దాటిన మహిళల ఎముకలు బలంగా ఉండాలంటే ఈ డ్రింక్ తాగితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఎముకలు చాలా బలహీనపడుతుంటాయి.

పిల్లలకు ఎముకలు బలపడాలంటే? 30ఏళ్లు దాటిన మహిళల ఎముకలు బలంగా ఉండాలంటే ఈ డ్రింక్ తాగితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఎముకలు చాలా బలహీనపడుతుంటాయి. అందులో ఆడవారికి ఎక్కువగా ఈ సమస్య జరుగుతుంటుంది. సరైన ఆహారాన్ని తీసుకోలేకపోవడం ద్వారా ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు మీరైతే ఈ డ్రింక్‌ను 15 రోజుల పాటు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కావలసిన పదార్థాలు:
నువ్వులు-1 టేబుల్ స్పూన్
గుమ్మడి విత్తనాలు-అర టేబుల్ స్పూన్
తేనె-2 టేబుల్ స్పూన్లు
 
తయారీ విధానం:
తేనె, నువ్వులు, గుమ్మడి విత్తనాలను సరైన మోతాదులో తీసికొని గ్రైండ్ చేసుకోవాలి. ఓ కప్పు వేడిపాలలో ఈ మిశ్రమాన్ని కలపాలి. ప్రతి రోజు ఉదయం అల్పాహారానికి తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి. ఈ మిశ్రమంలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇంకా విటమిన్ డి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ యాక్సిడెంట్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవన్నీ ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వవు. అంతేగాకుండా ఎముకలకు బలాన్నిస్తాయి.