శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chj
Last Modified: మంగళవారం, 9 మే 2017 (19:06 IST)

ఉద్యోగాలు చేస్తున్న మహిళల పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా?

పని చేసే చోట వివక్షను ఎదుర్కొనే వారిలో మనదేశ మహిళలు ముందు వరుసలో వున్నారు. కాకపోతే ఆ హింసను బయటకు చెప్పే విషయంలోనూ మన దేశ మహిళలే ముందున్నారు. కాగా రాక్ ఫెలర్, థామస్ రాయిటర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జి-20 దేశాల్లోని మహిళల ఉద్యోగ స్థితిగతులను పరిగణనలోనికి

పని చేసే చోట వివక్షను ఎదుర్కొనే వారిలో మనదేశ మహిళలు ముందు వరుసలో వున్నారు. కాకపోతే ఆ హింసను బయటకు చెప్పే విషయంలోనూ మన దేశ మహిళలే ముందున్నారు. కాగా రాక్ ఫెలర్, థామస్ రాయిటర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జి-20 దేశాల్లోని మహిళల ఉద్యోగ స్థితిగతులను పరిగణనలోనికి తీసుకుని చేసిన ఈ అధ్యయనం ప్రకారం, మనదేశంలోని ప్రతి నలుగురు ఉద్యోగినుల్లో ఒకరు కెరీర్లో మగవారితో సమానమైన అర్హత వున్నా, సమాన అవకాశాలు రాక ఇబ్బందిపడుతున్నారు. 
 
ఇంటినీ, ఉద్యోగాన్ని సమన్వయం చేయడం అనేది దాదాపుగా అందరూ ఎదుర్కొనే సమస్యే. 27 శాతం ఉద్యోగినులు పని చేసే చోట హింసను ఎదుర్కొంటున్నారు. వీరిలో 53 శాతం ఆ విషయాన్ని ధైర్యంగా బయటకు చెపుతున్నారు. 61 శాతం మగవారితో సమాన వేతనాలను అందుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాక పిల్లలు మునుపటితో పోలిస్తే ఎక్కువగా లబ్ది పొందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.