గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By ivr
Last Modified: గురువారం, 7 జులై 2016 (16:32 IST)

సేవామూర్తి అనూహ్యా రెడ్డి... సమాజసేవే ఆమె లక్ష్యం...

ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె దుస్తులను వినూత్నంగా తయారుచేసే ఓ ఫ్యాషన్ డిజైనర్. నయనతార, ప్రభాస్, కాజల్, సమంత, రమ్యకృష్ణ ఇలా ఎందరో సినీతారలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్. నెలకు లక్షలాది రూపాయల సంపాదన. చూడ చక్కని సంసారం. చాలు జీవితం హాయిగా సాగిపోవడానికి అనుకోలేదామె

ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె దుస్తులను వినూత్నంగా తయారుచేసే ఓ ఫ్యాషన్ డిజైనర్. నయనతార, ప్రభాస్, కాజల్, సమంత, రమ్యకృష్ణ ఇలా ఎందరో సినీతారలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్. నెలకు లక్షలాది రూపాయల సంపాదన. చూడ చక్కని సంసారం. చాలు జీవితం హాయిగా సాగిపోవడానికి అనుకోలేదామె! సమాజానికి తనవంతు సాయం చేయడంలోనే అసలైన ఆత్మసంతృప్తి అని భావించారు. ఒక స్వచ్ఛంధ సంస్థను స్థాపించి ఎంతోమంది అనాథలకు అమ్మగా, పేద విద్యార్ధులకు ఆపన్నహస్తం అందించి ఆప్తురాలిగా మారారు. 
 
మహిళల కోసం ఆరోగ్య శిక్షణా శిబిరాలు నిర్వహించి ‘తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్’’లో స్థానం సంపాదించారు అనూహ్యరెడ్డి. ‘కోవిధ సహృదయ ఫౌండేషన్’ పేరుతో పేద, మధ్యతరగతి స్త్రీల కోసం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చిన్ననాటి ఆసక్తే ఆమె ఆలోచనలకు ప్రాణం పోసింది. అమెరికాలో ఉన్నత విద్య చదివి, ఆధునిక యువతకు సన్నిహితమైన ఫ్యాషన్‌ను వేదికగా మార్చుకుంది. అలా వ్యాపకాన్ని వ్యాపారంగా మలుచుకుంటూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ అద్భుతంగా ప్యాషన్ రంగంలో రాణిస్తున్నారు అనూహ్యరెడ్డి.
 
చుట్టూ జరుగుతున్న అనేక ఘటనలు మనకు అనేక అనుభవాలను పంచుతాయి. ఆ అనుభవాలు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. అలాంటి ఆలోచనలు కొత్త కార్యాచరణకు శ్రీకారం చుడతాయి. అవే ఆలోచనలు నలుగురిలో భిన్నంగా నిలబెడతాయి. అలా నలుగురికీ భిన్నంగా ఆలోచిస్తూ ఆ నలుగురికీ చేయూతనందివ్వాలన్న సదుద్దేశ్యంతో అనూహ్య రెడ్డి, తన సంపాదనలో కొంత భాగం పిల్లలు, మహిళల సంక్షేమం కోసం కేటాయించి ఎంతోమందికి సాయం చేస్తున్నారు. కేవలం సాయం అందించడంతోనే బాధ్యత తీరిపోయిందని భావించడంలేదామె. చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో దురాగతాలపై ఆమె వంతుగా పోరాటం చేస్తున్నారు. 
 
ఆడపిల్లల అక్రమ రవాణా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో స్వచ్ఛభారత స్ఫూర్తితో గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. తనకంటూ ఓ గుర్తింపు ఇస్తున్న ఈ సమాజానికి, తనవంతుగా ఏదైనా చేయాలనే తలంపుతోనే ఇదంతా చేస్తున్నాననే ఆమె మాటలు, ఆమె సహృదయాన్ని తెలియజేస్తున్నాయి. 
 
మహిళల శక్తియుక్తులు ఈ సమాజ ఉత్పత్తిలో భాగం చేయాల్సిన అవసరముందని గుర్తించి అందుకోసం కృషి చేస్తున్న అనూహ్యరెడ్డికి అభినందనలు తెలుపుదాం. మరెందరికో సహాయసహకారాలు అందించాలని ఆశిద్దాం.